సినిమా

Bakasura Restaurant: చిన్న సినిమా, పెద్ద విజయం.. ఓటీటీలో దుమ్మురేపుతున్న‌ ‘బకాసుర రెస్టారెంట్’

Bakasura Restaurant: పెద్ద హీరోలు లేకుండా, పెద్ద ప్రచారం లేకుండా నిశ్శబ్దంగా విడుదలైన “బకాసుర రెస్టారెంట్” సినిమా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. థియేటర్లలో మంచి పేరు తెచ్చుకున్న ఈ సినిమా, ఇప్పుడు ఓటిటీలో కూడా దుమ్మురేపుతోంది. ప్రేక్షకులు దీనిని నిజంగానే ఒక “సర్ప్రైజ్ హిట్” అంటున్నారు. కంటెంట్‌కి విలువ ఇచ్చిన సినిమా ఇది.

కేవలం మంచి కథ, నిజమైన నటనతోనే ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. పెద్ద స్టార్ కాస్టింగ్ లేకపోయినా, ఈ సినిమా చూపించిన ప్రామాణికత, కథ చెప్పే విధానం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అమెజాన్ ఇండియాలో వరుసగా 24 రోజుల పాటు టాప్ 10లో నిలబడటం చిన్న విషయం కాదు. ఇది చిన్న సినిమా అని అనుకున్న వాళ్లకు కూడా ఇప్పుడు గర్వంగా మారింది. “కథ బలంగా ఉంటే హీరో ఎవడైనా పరవాలేదు” అనే విషయాన్ని ఈ సినిమా మరోసారి నిరూపించింది.

పెద్ద సినిమాల నడుమ నిలబడి, తన సత్తా చూపడం నిజంగా ప్రశంసనీయం. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాపై మంచి చర్చ నడుస్తోంది. ప్రేక్షకులు తమ అనుభవాలను పంచుకుంటూ, ఈ సినిమాని అందరికీ సిఫార్సు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు “బకాసుర రెస్టారెంట్” ఒక “మస్ట్ వాచ్ మూవీ”గా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button