తెలంగాణ
Dog attack: దారుణం.. ఐదేళ్ల బాలుడిపై కుక్కల దాడి

Dog attack: నిర్మల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కడెం కేంద్రంలోని కస్తూరిబా హాస్టల్ వద్ద ఘటన చోటు చేసుకుంది. బాలుడు భూమేష్ ఇంటి బైట ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్కలు దాడికి పాల్పడ్డాయి. బాలుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఖానాపూర్ ఆస్పత్రిలో బాలుడికి చికిత్స అందిస్తున్నారు.