తెలంగాణ
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గంజాయి చాక్లెట్లు పట్టివేత

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. రైల్వే స్టేషన్‌లోని 10వ ఫ్లాట్‌ఫామ్‌పై గంజాయి చాక్లెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్టీఎఫ్డీ బృందం, ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 1.600 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అయితే తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఫ్లాట్‌ఫామ్ పై ఉన్న సంచిని తనిఖీ చేయగా గంజాయి చాక్లెట్లను గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.



