తెలంగాణ
Kishan Reddy: 10శాతం రిజర్వేషన్లు తీసేస్తే.. నేను బీసీ రిజర్వేషన్ల బాధ్యత తీసుకుంటా

Kishan Reddy: ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు తీస్తేనే తాను బీసీ రిజర్వేషన్లపై బాధ్యత తీసుకుంటానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు తీసేస్తే తాను స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి మాట్లాడుతానని తెలిపారు.
అసదుద్దీన్ ఒవైసీ, అజారుద్దీన్, షబ్బీర్ అలీలు అసలు బీసీలు ఎలా అవుతారని ప్రశ్నించారు. ముస్లింలకు బీసీ రిజర్వేషన్లలో ఎట్లా ముడిపెడతారని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో రేవంత్ ప్రభుత్వం పునరాలోచన చేయాలని కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.



