తెలంగాణ
విదేశీయుడిని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

విదేశీయుడిని మోసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయని.. ఓ విదేశీయుడిని నమ్మించి 12కోట్ల రూపాయలు తీసుకుని మోసగించాడు ఓ వ్యక్తి. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఘటన జరిగింది. ఫ్రాన్సిస్ మహేంద్రకర్ అనే విదేశీయుడు ఈనెల 22న ఫిర్యాదు చేయడంతో నిందితుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
క్రికెట్ బెట్టింగులు, షేర్ మార్కెట్లో పెట్టడంతో పాటు భూములు కొనుగోలు చేయడానికి అకౌంట్లో డబ్బులు వేయించుకున్నాడని బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు చాకచక్యంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.