తెలంగాణ
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఎంకిర్యాల గ్రామానికి చెందిన లింగం అనే వ్యక్తి వాగులో దాటుతుండగా గల్లంతై మృతి చెందాడు. వాగుపై వంతెన లేకపోవడంతో లింగం ప్రాణం పోయిందని గ్రామస్తులు మండిపడుతున్నారు.
లింగం మృతదేహంతో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన బీజేపీ కార్యకర్తను పోలీసులు అడ్డుకున్నారు. మృతుడి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.



