జాతియం
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో 28 మంది మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ రేంజ్ మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘పున మర్గం’ కార్యక్రమంలో భాగంగా నారాయణ్‌పూర్ జిల్లాలో 28 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 19 మంది మహిళలు ఉండగా, అందరిపైనా కలిపి మొత్తం రూ. 89 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులందరూ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో క్రియాశీల సభ్యులు ఉన్నట్లుగా తెలుస్తోంది. లొంగిపోయిన మావోలు వారి వద్దనున్న అనేక ఆయుధాలను పోలీసులకు అప్పగించారు.



