Tirumala: తిరుమలలో డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు

Tirumala: కోట్లాది మంది ఆరాద్య దైవం తిరుమల వెంకన్నకు అత్యంత ముఖ్యమైన పర్వదినం వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి నాడు స్వామి వారిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసందేశంలోని ప్రదాన వైష్ణవ ఆలయాలలో వైకుంఠ ఏకాదశినాడు మూలవిరాట్ ను దర్శించుకుని ఉత్తర ద్వారం గుండా ప్రవేశించటం ద్వారా వైకుంఠ ప్రాప్తి చెందుతారని నమ్మకం కానీ తిరుమల శ్రీవారి ఆలయంలో మాత్రం ఉత్తర ద్వారానికి బదులుగా వైకుంఠ ప్రదక్షణ ద్వారం ఉంటుంది. ఆ మార్గం గుండా జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలని భక్తుల ఆకాంక్ష దీని కోసం పరితపిస్తుంటారు ప్రతి సంవత్సరం.
డిసెంబర్ 30వ తేది నుంచి జనవరి 8వ తేది వరకు తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనంను భక్తులకు కల్పించింది టీటీడీ. భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం ప్రారంభించి నాలుగేళ్లు అవుతుంది. అంతకు మునుపు వరకు వైకుంఠ ఏకాదశి., ద్వాదశి రోజుల్లోనే వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించే వారు.
2020లో ఈ సంప్రదాయాన్ని టీటీడీ ప్రారంభించింది. మఠాధిపతి, పీఠాధిపతుల అనుమతులతో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించవచ్చని ఆగమ సలహా మండలి సైతం ఆమోదముద్ర వేసింది. అప్పటి నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు 10 రోజులపాటు భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది టీటీడీ.
ఈ ఏడాది డిసెంబర్ 30 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకు సాగే వైకుంఠ ద్వారా దర్శనాల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. తొక్కిసలాట ఘటన పునరావృతం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వివిధ విభాగాధిపతులతో సమీక్షలు నిర్వహించింది. ఫీడ్బ్యాక్ సిస్టం ద్వారా శ్రీవారి సేవకుల సహాయంతో దాదాపు లక్ష మందికిపైగా భక్తుల నుండి అభిప్రాయ సేకరించింది.
వేలాది మంది భక్తుల ఫీడ్ బ్యాక్ తో సర్వదర్శన భక్తుల సౌకర్యార్థం ఈ సారి పెద్ద ఎత్తున టోకెన్స్ జారీ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది టీటీడీ. వైకుంఠ ద్వార దర్శనాల్లో భాగంగా మొదటి మూడు రోజులు డిసెంబర్ 30, 31, జనవరి 1 వరకు పూర్తిగా సర్వదర్శన భక్తులకే కేటాయించారు. ఈ మూడు రోజుల కోసం మొత్తం 1.88 లక్షల టోకెన్లను ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఆన్లైన్లో జారీ చేయనున్నారు. ఈ టోకెన్ల రిజిస్ట్రేషన్ కోసం ఈనెల 27వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు గడువు కేటాయించారు.
డిసెంబర్ 2 నుంచి టోకెన్లు అందుబాటులో ఉంటాయి. మిగతా ఏడు రోజులు, జనవరి 2 నుంచి 8 వరకు ప్రతిరోజూ 15,000 సర్వదర్శన టోకెన్లతో పాటు 1,000 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టోకెన్లను జారీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ 10 రోజుల్లో సుమారు 8 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
సర్వదర్శన భక్తులకు మరింత సమయం కేటాయించడం కోసం వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ భారీగా తగ్గించింది. మొత్తం 184 గంటల వైకుంఠ ద్వార దర్శన సమయంలో 164 గంటలు సర్వదర్శన భక్తులకే కేటాయించారు. ముఖ్యంగా మొదటి రోజు, 20 గంటల దర్శనంలో వీఐపీ బ్రేక్ కేవలం 4 గంటల 45 నిమిషాలకు మాత్రమే పరిమితం చేశారు.
మిగతా రోజుల్లో గరిష్ఠంగా కేవలం 2 గంటలకు మాత్రమే వీఐపీ బ్రేక్లు ఉంటాయి. వైకుంఠ ఏకాదశి , వైకుంఠ ద్వాదశి సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తూ, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ ఆధారంగా క్యూ లైన్లు నిర్వహించనున్నారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే తమ టోకెన్లను బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.



