Stock Market: స్టాక్ మార్కెట్‌కు సరికొత్త జోష్.. ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన నిఫ్టీ

Stock Market: స్టాక్ మార్కెట్‌కు సరికొత్త జోష్ వచ్చింది.మార్కెట్ ప్రారంభం కాగానే భారీ లాభాలతో ప్రారంభమైంది. సూచీలు దూసుకెళ్తున్నాయి. కొద్దిరోజులుగా ఒడిదుడుకులతో కొట్టుమిట్టాడుతున్న సూచీలు ఈరోజు సరికొత్త రికార్డ్ దిశగా దూసుకెళ్లాయి. నిఫ్టీ 26వేల 277 మార్కు చేరి ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పింది. 14 నెలల తర్వాత నిఫ్టీ ఈ కొత్త రికార్డ్‌ను సృష్టించింది.
ప్రస్తుతం సెన్సెక్స్ 275 పాయింట్లు లాభపడి 85వేల 884 దగ్గర కొనసాగుతుండగా నిఫ్టీ 178 పాయింట్లు లాభపడి 27, 971 దగ్గర కొనసాగుతోంది. ఇక నిఫ్టీలో హిందాల్కో, ఎల్ అండ్ టీ, ఎన్‌టీపీసీ, జియో ఫైనాన్షియల్, బజాజ్ ఫైనాన్స్ ప్రధాన లాభాలను ఆర్జించగా టైటాన్ కంపెనీ, అపోలో హాస్పిటల్స్, మ్యాక్స్ హెల్త్‌కేర్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా నష్టపోయాయి. బీఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు స్వల్పంగా పెరిగాయి.



