తెలంగాణ

Loan App: లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి

Loan App: లోన్ యాప్‌ కారణంగా మరో యువకుడు బలైయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. లోన్ యాప్ వేధింపులు తాళలేక సంతోష్ అనే యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లోన్ యాప్ ద్వారా లక్ష రూపాయలు తీసుకున్న సంతోష్..50 వేలు మాత్రమే చెల్లించాడు..మిగిలిన డబ్బులు చెల్లించకపోవడంతో లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురి చేశారు. దీంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button