సినిమా

Ajith Kumar: శేషజీవితంపై అజిత్ షాకింగ్ కామెంట్స్?

Ajith Kumar: తమిళ స్టార్ అజిత్‌కు జెంటిల్మెన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్-2025 అవార్డు లభించింది. ఈ సందర్భంగా తన శేషజీవితం భార్య శాలిని, కుమారుడు, కూతురితోనే గడుపుతానని భావోద్వేగంగా పేర్కొన్నారు.

తల అజిత్ జీవితంలో మరో మైలురాయి నమోదైంది. ఎస్‌ఆర్‌ఓ మోటార్‌స్పోర్ట్స్ సంస్థ నుంచి జెంటిల్మెన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్-2025 బిరుదు అందుకున్నారు. బెల్జియం, దుబాయ్‌లో జరిగిన అంతర్జాతీయ కార్ రేసుల్లో పలు పతకాలు సాధించిన ఘనత అజిత్‌దే. సొంతంగా రేసింగ్ సంస్థను కూడా ప్రారంభించిన ఈ స్టార్ ఇప్పుడు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అవార్డు ప్రదానోత్సవంలో శాలిని, కుమారుడు, కూతురితో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా తన శేషజీవితం గురించి హృదయాన్ని ఆకట్టుకునే విషయాలు పంచుకున్నారు. నెలలో 15 రోజులు సినిమాకు, మిగతా 15 రోజులు కుటుంబానికి కేటాయిస్తానని, ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరోటి చేస్తానని స్పష్టం చేశారు. ఇక సినిమాల తరువాత పూర్తిగా తన భార్య, పిల్లలతో మిగిలిన జీవితాన్ని గడుపుతానని భావోద్వేగంగా తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button