తెలంగాణ
గాంధీభవన్‌లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఆరో రౌండ్ తర్వాత కాంగ్రెస్‌కు 15 వేల 589 ఓట్ల ఆధిక్యంలో ఉంది. బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమైంది. జూబ్లీహిల్స్‌లో బీజేపీ ప్రభావం చూపలేకపోయింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఇక లాంఛనమే కానుంది. గాంధీభవన్‌లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. బాణసంచా పేల్చి, స్వీట్లు పంచి ఆనందం పంచుకున్నారు.



