జాతియం

డ్యూటీలో ఉండగా గుండెపోటు.. కార్డియాక్‌ సర్జన్‌ మృతి

హృద్రోగ బాధితులకు చికిత్స చేసి ప్రాణాలు కాపాడే వైద్యుడు అదే గుండెపోటుతో మరణించాడు. ఆసుపత్రిలో రోగులను పరీక్షిస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు.ప్రస్తుతం గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. చిన్న వయసు పిల్లలు, శారీరకంగా ఫిట్‌గా ఉండి ఎటువంటి సమస్యలు లేని యువత సైతం హఠాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. తమిళనాడుకు చెందిన కార్డియాక్‌ సర్జన్‌ గ్రాడ్లిన్‌ రాయ్‌ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో కార్డియాక్‌ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ గ్రాడ్లిన్‌ రాయ్‌ విధుల్లో భాగంగా ఆసుపత్రి వార్డుల్లో రౌండ్స్‌లో ఉండగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అతడిని కాపాడడానికి సహోద్యోగులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని గ్రాడ్లిన్‌ రాయ్‌ ప్రాణాలు కోల్పోయారని ఆసుపత్రి అధికారులు పేర్కొన్నారు.

కార్డియాలజీపై అవగాహన ఉండి అన్నిరకాల జాగ్రత్తలు తీసుకునే కార్డియాక్‌ సర్జన్‌ గుండె పోటుతో మరణించడం ఆందోళనకరమైన విషయమని సహచర డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ పేర్కొన్నారు. గ్రాడ్లిన్‌ రాయ్‌కు ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా లేవన్నారు. యువతలో హఠాత్తుగా సంభవిస్తున్న గుండెపోటు మరణాలకు ఒత్తిడి, దీర్ఘకాలిక పని గంటలే కారణమని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

వైద్యులు రోజుకు 12-18 గంటలు పనిచేయాల్సి వస్తుందని కొన్నిసార్లు ఒకే షిఫ్ట్‌లో 24 గంటలు కూడా విధుల్లో ఉండాల్సి వస్తుందన్నారు. అందువల్ల వారిపై ఒత్తిడి అధికంగా ఉంటుందన్నారు. మరికొందరిలో అనారోగ్యకరమైన జీవనశైలి, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి అనేక కారణాలు కూడా ఉండొచ్చని తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button