సినిమా
Poonam Kaur: సామ్ పెళ్లి రోజు పూనమ్ కౌర్ సంచలన ట్వీట్!

Poonam Kaur: నటి పూనమ్ కౌర్ మరో వివాదాస్పద ట్వీట్ చేసింది. ‘వేరే వాళ్ల కొంప కూల్చి ఇల్లు కడతావా?’ అని ప్రశ్నించింది. ఇది సమంత వైపు సూచిస్తోందని నెటిజన్ల నుంచి ఊహాగానాలు వస్తున్నాయి. ఈ ట్వీట్ గురించి పూర్తి వివరాలు చూద్దాం.
సోషల్ మీడియాలో తన విమర్శలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న నటి పూనమ్ కౌర్ మళ్లీ ఒక ట్వీట్‌తో చర్చనీయాంశమైంది. “నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా? ఇది బాధాకరం.” అని ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్ లో ఎవరి పేరు చెప్పకపోయినా టైమింగ్ చూస్తే ఇది సమంత పైనే అని నెటిజన్లు భావిస్తున్నారు. నిన్న సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్న నేపథ్యంలో ఈ ట్వీట్ వైరల్ అయింది.



