ఆంధ్ర ప్రదేశ్

నేడు అనకాపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన

నేడు అనకాపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఉండవల్లిలోని నివాసం నుంచి ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌లో చంద్రబాబు బయలుదేరుతారు. తాళ్లపాలెం పంచాయతీ బంగారయ్యపేటకు 11 గంటల 15 నిమిషాలకు చేరుకుంటారు. స్థానికంగా ఓ ఇంటికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడతారు.

గ్రామంలో నిర్వహించే స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రజావేదికలో పాల్గొంటారు. సుమారు గంటన్నరసేపు గ్రామస్థులతో సమావేశమవుతారు. ఆ తర్వాత గంటసేపు టీడీపీ కార్యకర్తలతో సమావేశమవుతారు. అనంతరం జలగలమదుం కూడలిలో ఏర్పాటు చేసిన అటల్‌ బిహారీ వాజపేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button