సినిమా
Ibomma: ఐ బొమ్మ రవి కేసులో ఈడీ ఎంట్రీకి రంగం సిద్ధం

Ibomma: ఐ బొమ్మ రవిని కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. రవిని పూర్తిస్థాయిలో విచారించేందుకు పోలీసులు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేయనున్నారు. సినీ పైరసీలో కోట్ల రూపాయల సొమ్మును రవి సంపాదించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పైరసీ లింకులు ఎక్కడెక్కడ ఉన్నాయనే కోణంలో విచారించనున్నారు. రవికి సహకరించినవారు, రవి టీమ్ ఎవరనేది పోలీసు విచారణలో తేటతెల్లం అయ్యే అవకాశం ఉంది. దేశ విదేశాల్లో పైరసీ చేసినందున ఈడీ కూడా ఈ కేసులో దర్యాప్తు చేయనుంది.



