జాతియం
మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు లొంగుబాటు

మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా వ్యవహరించారు మల్లోజుల. మావోయిస్టు పార్టీ విధానాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కొన్ని రోజుల కిందట వేణుగోపాల్ రావు లేఖ రాశారు. కొన్నిరోజులుగా పార్టీ అనుసరిస్తున్న విధానాలతో ఆయన విభేదిస్తున్నారు. విప్లవోద్యమాన్ని విజయవంతం చేయాలంటే ప్రజల్లోకి బహిరంగంగా వెళ్లడమే సరైన మార్గమని లేఖాస్త్రం కూడా సంధించారు.
60 మందితో కలిసి మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ పరిణామం మావోయిస్టు ఉద్యమానికి ఊహించని షాక్‌గా విశ్లేషకులు భావిస్తున్నారు. తాను మావోయిస్టు పార్టీ నుంచి శాశ్వతంగా వైదొలగుతున్నట్లు వేణుగోపాల్ ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇకపై పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు.



