తెలంగాణ

మాదాపూర్ మై హోమ్ భుజా లడ్డూ రికార్డ్ ధర .. ₹51.77 లక్షలు

హైదరాబాద్ నగరంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గణేష్ నిమజ్జనాల సందర్భంగా లడ్డూ వేలం పాటలను నిర్వాహకులు వైభవంగా నిర్వహిస్తున్నారు. సిటీలో మాదాపూర్ మై హోమ్ భుజా గణేష్ లడ్డూకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ప్రతి ఏడాది అంతకంతకూ ఈ లడ్డూ ధర రికార్డ్ బ్రేకవుతోంది.

మాదాపూర్ మై హోమ్ భుజాలో లడ్డూ వేలం పాట రికార్డు బ్రేక్ చేసింది. ఈ ఏడాది కూడా హోరా హోరీగా లడ్డూ వేలం పాట సాగింది. 51లక్షల77వేల777కు ధర పలికింది. ఈ ఏడాది లడ్డూను గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత కైవసం చేసుకున్నారు. గత సంవత్సరం29 లక్షలకు మాదాపూర్ మై హోమ్ భుజా లడ్డూ ధర పలికింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button