ఆంధ్ర ప్రదేశ్

టైగర్ IKF స్కౌట్ ఆన్ వీల్స్ భారత ఫుట్‌బాల్ ఉద్యమం

భారతదేశంలో ఇప్పటివరకు అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రాస్‌రూట్ ఫుట్‌బాల్ ఉద్యమాలలో ఒకటైన టైగర్ ఐకెఎఫ్ స్కౌట్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇండియా ఖేలో ఫుట్‌బాల్ IKF ప్రకటించింది. విశాఖపట్నంలో ప్రారంభించిన ఈ కార్యక్రమం, 16 నగరాలు పట్టణాల గుండా ప్రయాణించిన ఈ రోడ్‌షో, గ్రాస్‌రూట్ స్థాయిలో ఆటగాళ్లను గుర్తించాలన్న లక్ష్యంగా ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఫుట్‌బాల్‌ను అందుబాటులోకి తేవడంతోపాటు, అవకాశం ఎలా ఉంటుందో తెలియజేస్తోంది. IKF కార్యాచరణకు ఏపీ టూరిజం డిపార్ట్‌మెంట్, టైగర్ క్యాపిటల్, ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ మద్దతిచ్చాయి. IKF కార్యక్రమం ఏపీ అంతటా అట్టహాసంగా సాగింది. ప్రతి చోట 100 నుంచి 200 మంది పిల్లలు పాల్గొన్నారు.

ఫుట్‌బాల్ ట్రయల్స్‌, IKF ఫుట్‌బాల్ అవగాహన & సాధికారత శిబిరాల్లో ఆటగాళ్లతో నిండిపోయింది. IKF చొరవను అందరూ అభినందించారు. ఆంధ్రప్రదేశ్ అంతటా 16 ప్రదేశాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. IKF జోనల్ ఫైనల్స్‌కు 80 ప్లస్ ప్రతిభావంతులైన క్రీడాకారులు స్కౌట్ చేశారు. 7 మంది అసాధారణ ప్రదర్శనకారులకు ఈ సైకిళ్లు పంపిణీ చేశారు. ముఖ్యంగా రాజమండ్రి, కడపలో పెద్ద సంఖ్యలో బాలికలు పాల్గొన్నారు. ప్రతి జిల్లాలోని తల్లిదండ్రులు, స్థానిక క్లబ్‌లు, పాఠశాలలు , పంచాయతీలతో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం విజయవంతం కోసం పనిచేసిన వారికి IKF హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.

ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ కార్యక్రమానికి మంచి గుర్తింపు లభించిందన్నారు IKF వ్యవస్థాపకుడు, ఫణి భూషణ్. ప్రతి స్టాప్‌లో ప్రతిభ ధైర్యంతో నిండిన యువత పాల్గొందన్నారు. ఫుట్‌బాల్ ప్రతి పట్టణంలోని ప్రతి విద్యార్ధికి చెందినదని స్కౌట్ ఆన్ వీల్స్ నిరూపించిందన్నారు. ఇది ప్రారంభం మాత్రమేన్న ఆయన.. వచ్చే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేస్తామన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుండి స్కౌట్‌లో సత్తా చాటిన ఆటగాళ్ళు ఇప్పుడు IKF జోనల్ ఫైనల్స్‌కు వెళతారు.

తరువాత జాతీయ గ్రాండ్ ఫైనల్ జరుగుతుంది. ఇక్కడ భారతదేశంతోపాటుగా, విదేశాల నుండి అగ్రశ్రేణి క్లబ్‌ల నుంచి ఆటగాళ్లు పాల్గొంటారు. స్కౌట్ ఆన్ వీల్స్ ముగిసి ఉండవచ్చు, కానీ భారతదేశ ఫుట్‌బాల్ మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్ ఉనికిని చాటే ఉద్యమం ఇప్పుడే ప్రారంభమైందని నిర్వాహకులు చెబుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button