తెలంగాణ
Sangareddy: కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి అనుమానాస్పద మృతి

Sangareddy: స్థానిక సంస్థల ఎన్నికల వేళ సర్పంచ్ అభ్యర్థి అనుమానస్పద మృతి కలకలం రేపింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం శంషోద్దిన్ పూర్ లో చోటుచేసుకుంది. మండలంలోని పిప్పాడ్ పల్లి గ్రామానికి చెందిన రాజు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
అయ్యప్ప మాల ధరించిన రాజు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాలాజీ నరసింహులు ఫామ్ హౌస్‌లో ఉంటున్నాడు. ఫామ్ హౌస్ పక్కనే ఉన్న చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సర్పంచ్ అభ్యర్థి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



