తెలంగాణ

ఉస్మానియా యూనివర్సిటీ పరిసరాల్లో హైటెన్షన్

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ పరిసరాల్లో హైటెన్షన్ నెలకొంది. వామపక్ష విద్యార్థి సంఘాలు ఓయూ బంద్‌కు పిలుపునివ్వడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వర్సిటీలో ఆందోళన లు, నినాదాలపై నిషేధం విధిస్తూ.. సర్య్కులర్ విడుదల చేయడంపై వారంరోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆర్ట్స్ కాలేజ్‌ను బంద్ చేయడానికి వచ్చిన విద్యార్థులను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు పోలీసులు.

మరోవైపు ఉద్యమాలను ఆపే శక్తి ఎవరికీ లేదంటున్నారు స్టూడెంట్స్. వీసీ, ప్రొఫెసర్ కుమార్ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. వందేమాతరం ఉద్యమం తెలంగాణ ఉద్యమం వర్సిటీ నుండే పుట్టిందని గుర్తుచేశారు. వర్సిటీ సమస్యలు, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే తమపై ఆంక్షలేంటని వామపక్ష విద్యార్థి సంఘాలు నిలదీస్తున్నాయి. వీసీ, ప్రొఫెసర్ సర్య్కులర్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button