ఏపీలో 14 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 14 మంది ఐఏఎస్ అధికారులను బదిలీలుచేస్తూ పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పి.శ్రీనివాసులు, ప్రకాశం జిల్లా జేసీగా కల్పన కుమారి, తిరుపతి జాయింట్ కలెక్టర్‌గా మరియు టుడా వైస్ చైర్మన్‌గా ఆర్.గోవిందరావును నియమించింది. కడప జేసీగా నిధి మీనా, అనంతపురం జేసీగా సి.విష్ణుచరణ్, అనకాపల్లి జేసీగా మల్లవరపు సూర్యతేజ, చిత్తూరు జేసీగా ఆదర్శ్ రాజేంద్రన్‌కు పోస్టింగులు ఇచ్చింది.
అలాగే అన్నమయ్య జేసీగా శివ్ నారాయణ్ శర్మ, పల్నాడు జేసీగా వి.సంజనా సింహ, విశాఖ జేసీగా గొబ్బిళ్ల విద్యాధరిని నియమించింది. వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీగా రోణంకి గోపాలకృష్ణ, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌గా శ్రీవాస్ నుపుర్ అజయ్‌కుమార్, గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా కతవాటె మయూర్ అశోక్, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఎండీగా ఎస్.ఎస్.శోబికను ప్రభుత్వం బదిలీ చేసింది.



