ఆంధ్ర ప్రదేశ్

AP: విద్యార్థిని చితకబాదిన తోటి విద్యార్థులు.. వీడియో వైరల్‌

ఏపీలో ర్యాగింగ్‌ భూతం మళ్లీ కలకలం రేపుతోంది. ఇప్పటికే హాస్టళ్లలో ర్యాగింగ్‌ పేరుతో జూనియర్‌ విద్యార్థులను చితకబాదిన సంఘటనలు వెలుగుచూడగా.. తాజాగా మరో వీడియో ఒకటి బయటకొచ్చింది. ఒక విద్యార్థిని తోటి విద్యార్థులు చితకబాదుతున్న వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఒక విద్యార్థిని తోటి విద్యార్థులు చుట్టూ చేరి చితకబాదారు. మోకాళ్ల మీద నిల్చోబెట్టి మరీ దాడికి దిగారు. క్షమించమని అడిగినప్పటికీ కనికరించకుండా ఇష్టమొచ్చినట్లుగా కొట్టారు. పదే పదే కొట్టడమే కాకుండా కింద పడేసి కాలితో తన్నుతూ రెచ్చిపోయారు.

ఓ విద్యార్థి ఆపమని చెప్పినా వినకుండా మరింత దుర్మార్గంగా వ్యవహరించాడు. ఈ తతంగమంతా కూడా అక్కడే ఉన్న మరో విద్యార్థి తన మొబైల్‌లో రికార్డు చేశారు. ఈ దృశ్యాలు ఇప్పుడు బయటకు రావడంతో సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ ఘటనపై దాడికి గురైన విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడి చేసిన విద్యార్థులను కాలేజీ నుంచి సస్పెండ్‌ చేసి, చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button