ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రిషబ్ శెట్టి

తిరుమల శ్రీవారిని ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి దర్శించుకున్నారు. స్వామివారి వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు రిషబ్ శెట్టి. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల రిషబ్ శెట్టిని చేసేందుకు భక్తులు ఆసక్తి చూపారు. ఫొటోలు దిగేందుకు భక్తులు ఎగబడ్డారు.



