ఆంధ్ర ప్రదేశ్

వెలుగొండ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి నిమ్మల రామానాయుడు

Nimmala Ramanaidu: ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని వెలుగొండ ప్రాజెక్టును సందర్శించారు మంత్రి నిమ్మల రామానాయుడు. వందేమాతరం రచించి నేటికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి వందేమాతరం గీతాన్ని ఆలకించారు. అనంతరం వెలుగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బ తిన్న ప్రాజెక్టు ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు.

అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది జూన్ కల్లా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి వెలుగొండ ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేయడం హాస్యాస్పదమని విమర్శించారు. తల్లిని చెల్లిని మోసం చేసినట్లుగానే ప్రకాశం ప్రాంత ప్రజలకు మోసం చేశారని ధ్వజమోత్తారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button