ఆంధ్ర ప్రదేశ్
Satyakumar: పీపీపీపై మాట్లాడే అర్హత జగన్కు లేదు

Satyakumar: వైద్య కళాశాలల్లో బాలికల వసతిగృహం నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు ఇవ్వలేని జగన్కు పీపీపీ గురించి మాట్లాడే అర్హత లేదని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ విమర్శించారు. విద్యార్ధులకు ఉన్నత వైద్య విద్య, ఉత్తమ చికిత్స లక్ష్యంగా పీపీపీ విధానాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
విజయవాడలోని ప్రభుత్వ సిద్దార్థ వైద్యకళాశాల బాలికల వసతిగృహ ప్రారంభం సందర్భంగా మంత్రి సత్య కుమార్ మాజీ సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు యార్లగడ్డ, గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు.



