SRH vs DC: నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్

SRH vs DC: నేడు ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2025లో నేడు 55వ మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరుగుతుంది. ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. 10 మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలతో దాదాపు ప్లేఆఫ్ రేసుకు దూరంగా ఉన్న హైదరాబాద్ జట్టు ఈ మ్యాచులో గెలుస్తుందో లేదో చూడాలి మరి. ఆరెంజ్ ఆర్మీకి ఈ సీజన్ సెట్ కాలేదు. టాప్ ఆర్డర్, ఫాస్ట్ బౌలింగ్ ఫాంంతో ఇబ్బంది పడుతుంది. అయినప్పటికీ హైదరాబాద్ జట్టు తమ ప్రత్యర్థి జట్టు గట్టి పోటీ ఇవ్వాలని ఆశిస్తోంది.
గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 18వ సీజన్‌లో మాత్రం తమ ప్రస్థానం తుది దశకు చేరుకుంది. ఈ సీజన్‌లో మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా నేటి మ్యాచ్ ఫలితంతో చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితి ఏర్పడింది. ఈరోజు ఉప్పల్ స్టేడియంలో జరిగే పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ ని హైదరాబాద్ ఢీ కొట్టబోతుంది. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ ఖాతాలో 3 విజయాలతో కేవలం 6 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 4 మ్యాచ్ లు గెలిస్తే 14 పాయింట్లకు చేరుకుంటుంది. దీంతో ప్లే ఆఫ్స్‌కు చేరుకునే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి.
మరోవైపు ఢిల్లీ జట్టు గత ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో ఓడిపోయింది. టోర్నమెంట్ చివరి దశకు వచ్చిన నేపథ్యంలో మొదటి నాలుగు స్థానాల్లోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అక్షర్ పటేల్ నేతృత్వంలోని జట్టు ప్రత్యర్థిని ఓడించడానికి విభిన్న వ్యూహాలను రూపొందిస్తోంది. ఈ సీజన్‌లో చివరిసారిగా ఈ రెండు జట్లు తలపడినప్పుడు, క్యాపిటల్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించడం విషయం.
ఇప్పటివరకు ఈ రెండు జట్లు 25 ఐపీఎల్ ఆటల్లో ఒకదానితో ఒకటి తలపడ్డాయి. ఆ క్రమంలో SRH 13 సార్లు గెలువగా, DC 12 సార్లు గెలిచింది. హైదరాబాద్ హెడ్ టు హెడ్ లో కొంచెం ముందంజలో ఉన్నప్పటికీ, గూగుల్ గెలుపు అంచనా ప్రకారం చూస్తే మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ గెలిచేందుకు 53 శాతం ఛాన్సుందని తెలిపింది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి కేవలం 47 శాతమే అవకాశం ఉంది.