సినిమా

సుజిత్‌కు పవన్ గిఫ్ట్ వెనుక ఇంత కథ ఉందా?

Pawan Kalyan: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ డైరెక్టర్ సుజిత్‌కు లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చారు. ఓజీ సినిమా విజయానికి బహుమతి అని అంతా అనుకున్నారు. కానీ ఆ గిఫ్ట్ వెనుక మరో ఆసక్తికర కారణం ఉందని తెలుస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.

పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకు దర్శకత్వం వహించిన సుజిత్‌కు ఆయన లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చారు. రేంజ్ రోవర్ డిఫెండర్ మోడల్ కారును అందుకున్న సుజిత్ ఈ విషయాన్ని ఆనందంతో సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీన్ని ఓజీ సక్సెస్‌కు బహుమతి అని అనుకున్నారు. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న టాక్ మరొకటి. ఓజీ షూటింగ్ లాస్ట్ షెడ్యూల్ జపాన్‌లో చేయాలని సుజిత్ ప్లాన్ చేశారట. కానీ బడ్జెట్ సమస్యతో నిర్మాత ఒప్పుకోలేదు.

అయినా సుజిత్ ఆ సన్నివేశాలు జపాన్‌లోనే చేయాలని భావించారు. దీంతో తన సొంత ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును అమ్మి ఆ డబ్బుతో జపాన్ షెడ్యూల్ పూర్తి చేశారట. ఈ విషయం మూవీ డబ్బింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. దర్శకుడు తన వాహనాన్ని అమ్మి సినిమా కోసం ప్రయత్నించినందుకు ఇంప్రెస్ అయ్యారట. అందుకే అదే మోడల్ కారును గిఫ్ట్ ఇచ్చారు. కారు ఈఎంఐలు కూడా పవన్ చెల్లిస్తారని టాక్. ఈ కథ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button