తెలంగాణ
Telangana Assembly: రేవంత్, హరీష్ మధ్య మాటల యుద్ధం.. బీఆర్ఎస్ వాకౌట్

Telangana Assembly: మూసీ ప్రక్షాళనపై తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ జరిగింది. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ విరుచుకుపడ్డారు. కడుపులో విషం పెట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
సీఎం వ్యాఖ్యలకు బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. మూసీ కంపు కంటే రేవంత్ మాటల్లో కంపు ఎక్కువ ఉందని హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. సీఎం మాట్లాడిన తర్వాత తమకు అవకాశం ఇవ్వనందుకు సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.



