తెలంగాణ
Hyderabad: అర్ధరాత్రి సయ్యద్ ఇంట్లో గుజరాత్ ఏటీఎస్ సోదాలు

Hyderabad: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో మరోసారి గుజరాత్ ఏటీఎస్ పోలీస్ సోదాలు కలకలం సృష్టించాయి. ఫోర్త్ వ్యూ కాలనీలోని డాక్టర్ సయ్యద్ మొహియుదిన్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బృందం సోదాల్లో పాల్గొంది. మూడు రకాల లిక్విడ్‌లతో పాటు కంప్యూటర్, పలు రకాల బుక్స్, ఆయిల్ తయారు చేసే మిషన్ సహా పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
సయ్యద్ సోదరుడు ఓమర్ ఫారుఖీకి నోటీసులు ఇచ్చి సెర్చ్ నిర్వహించారు. అనంతరం సామాగ్రిని సీజ్ చేశారు. దేశంలో పెను విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్‌ను ఏటీఎస్ పోలీసులు గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో అరెస్టు చేశారు.



