ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో ప్రమాదం.. రెండో ఘాట్రోడ్డులో డివైడర్ను ఢీకొన్న బస్సు

Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు డివైడర్ను ఢీకొట్టింది. బస్సు ప్రమాదంతో అలిపిరి వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. క్రాస్ బారియర్ పటిష్టంగా ఉండటంతో ప్రమాదం తప్పింది. లేకుంటే బస్సు లోయలో పడే అవకాశం ఉండేదని భక్తులు తెలిపారు. అధికారులు క్రేన్ సహాయంతో బస్సును పక్కకు తొలగిస్తున్నారు.