జాతియం
నేడు లోక్‌సభలో వందేమాతర గీతంపై ప్రత్యేక చర్చ

వందేమాతర గీతంపై నేడు లోక్‌సభలో ప్రత్యేక చర్చ జరుపనున్నారు. వందేమాతర గీతం 150 సంవత్సరాల వేడుకను ఏడాది పాటు నిర్వహించుకోవడంలో భాగంగా ఈ చర్చ చేపట్టనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో వందేమాతరంపై చర్చను ప్రారంభించనున్నారు. వందేమాతర గీతంపై 10 గంటల పాటు చర్చ జరగనుంది. వందేమాతరంపై రేపు రాజ్యసభలో చర్చించనున్నారు. రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా చర్చను ప్రారంభించనున్నారు.



