తెలంగాణ
వరంగల్ కమిషనరేట్‌లో నిమజ్జన ఏర్పాట్లు

వరంగల్ కమిషనరేట్ పరిధిలో 6,683 గణపతి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు చెరువుల వద్ద 22 ఘాట్లు ఏర్పాట్లు చేశారు. 2100 పోలీస్ సిబ్బంది నిమజ్జనాన్ని పర్యవేక్షించనున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల పర్యవేక్షణలో నిఘా ఏర్పాటు చేశారు.
వరంగల్ కమిషనరేట్‌లోని వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల కలెక్టర్లు, అధికార యంత్రాంగం నిమజ్జన ఏర్పాట్లపై నిమగ్నమై ఉన్నారు. గజ ఈతగాళ్లను, నిమజ్జనానికి భారీ క్రేన్లను, ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు.



