తెలంగాణ
Warangal: పెళ్లి చేసుకొని నగలతో ఉడాయించిన యువతి

Warangal: వరంగల్ జిల్లాలో కిలాడీ పెళ్లి కూతురు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. యువళి పెళ్లి చేసుకొని నగలతో ఉడాయించింది. 2లక్షల నగదు, 8 తులాలకు పైగా బంగారంతో పరారైంది. పర్వతగిరి మండలం చౌటపల్లిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విజయవాడకు చెందిన యువతి మ్యాట్రిమోనీ సైట్ లో ప్రొఫైల్ అప్ లోడ్ చేసి అమాయకులను మోసం చేస్తుంది. యువతి పేరెంట్స్, బంధువులు అంతా ఫేక్ అని వరుడు తెలుసుకున్నాడు. మరో ఇద్దరు యువకులను సైతం ఇదే తరహాలో యువతి మోసం చేసింది.



