Pawan Kalyan: బాలయ్య, అజిత్ కుమార్‌లకు డిప్యూటీ సీఎం పవన్ శుభాకాంక్షలు

Pawan Kalyan: సౌత్ సినిమా స్టార్ హీరోలు నందమూరి బాలకృష్ణ, తమిళ సూపర్ స్టార్ అజిత్‌లు దేశంలోని అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ గౌరవం వారి అభిమానులకు ఆనందం నింపుతుండగా, ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ స్టార్స్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
నందమూరి బాలకృష్ణ, అజిత్‌లు తమ అసాధారణ నటన, సినిమా పరిశ్రమకు అందించిన విశేష సేవలతో పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, బాలయ్య, అజిత్‌లను ప్రశంసిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వారి వినూత్నమైన సినిమా ఎంపికలు, చిత్ర పరిశ్రమకు అందించిన కృషిని కొనియాడిన పవన్, ఇద్దరు స్టార్స్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
పవన్ ఈ సందేశంతో బాలయ్య, అజిత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు ఈ ఇద్దరు హీరోల సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. పవన్ శుభాకాంక్షలతో ఈ గౌరవం మరింత ప్రత్యేకమైందని అంటున్నారు అభిమానులు.



