తెలంగాణ
Nizamabad: దారుణం.. స్విగ్గి డెలివరీ బాయ్‌పై గంజాయి బ్యాచ్ దాడి..

Nizamabad: నిజామాబాద్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. స్విగ్గి డెలివరీ బాయ్‌పై గంజాయి బ్యాచ్ దాడికి పాల్పడింది. మారణ ఆయుధాలతో ఐదుగురు యువకులు దాడి చేశారు. డెలివరీ డబ్బులు చెల్లించమన్నందుకు బాయ్ పై గంజాయి బ్యాచ్‌కు చెందిన ఐదుగురు విచక్షణా రహితంగా దాడి చేశారు. స్విగ్గి డెలివరీ బాయ్ పరిస్థితి విషమంగా ఉండటంతో.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.