తెలంగాణ
మాదాపూర్ నివాసంలో మాగంటి గోపినాథ్ భౌతికకాయం

కాసేపట్లో మాగంటి గోపినాథ్ ఇంటికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకోనున్నారు. గోపినాథ్ భౌతికకాయానికి నివాళులు అర్పించనున్నారు. ఇవాళ సాయంత్రం 4గంటలకు మహాప్రస్థానంలో మాగంటి గోపినాథ్ అంత్యక్రియలు జరుగనున్నాయి.
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అదేవిధంగా ఏఐజీలో చికిత్స ఖర్చు మొత్తాన్ని సర్కార్ భరించనున్నట్లు ప్రకటించింది.