తెలంగాణ
Road Accident: బొలెరోను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు మృతి

Road Accident: మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇందారం ఎక్స్‌రోడ్ వద్ద రోడ్డు వద్ద ఆగి ఉన్న బులారో వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మహారాష్ట్ర నుంచి 23 మంది కూలీలతో కరీంనగర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ మూత్ర విసర్జన కోసం రోడ్డు పక్కన వాహనం ఆపిన సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదంలో గాయపడిన వారిని పోలీసులు వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.



