తెలంగాణ
ప్రధాని మోడీతో సీఎం రేవంత్ భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి భేటీ అయ్యారు. ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ కు రావాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధానిని ఆహ్వానించారు. మంగళవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలిసి, సమ్మిట్‌కు హాజరవాలని కోరారు.



