మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీపై ఈడీ చర్యలు

Anil Ambani: మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీపై ఈడీ చర్యలు చేపట్టింది. దర్యాప్తులో భాగంగా అనిల్ అంబానీకి సంబంధించిన 3 వేల కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తుల జాబితాలో ఆయన నివాసంతోపాటు పలు కమర్షియల్ ప్రపర్టీలు ఉన్నాయి.
ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో ఉన్న అనిల్ అంబానీ నివాసం, ఢిల్లీలోని రిలయన్స్ సెంటర్‌కు చెందిన కొంత భూమిని ఈడీ అటాచ్ చేసింది. వీటితో పాటు ఢిల్లీ, నోయిడా, గాజియాబాద్, ముంబై, పుణె, ఠాణె, హైదరాబాద్, చెన్నై, తూర్పుగోదావరిలో అనిల్ అంబానీ కంపెనీలకు చెందిన పలు నివాస, వాణిజ్య ఆస్తులు ఈ జాబితాలో ఉన్నాయి. వీటి మొత్తం విలువ 3 కోట్ల 84 వేల ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ.
అనిల్ గ్రూప్ కంపెనీల కోట్ల రూపాయల బ్యాంకు రుణాల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దీనిపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. రిలయన్స్ ఇన్‌ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు 17వేల కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది జులైలో రిలయన్స్ గ్రూప్‌లోని 50 కంపెనీలకు చెందిన 35 ప్రాంతాల్లో, 25 మంది వ్యక్తులపై ఈడీ సోదాలు నిర్వహించింది.



