ఆంధ్ర ప్రదేశ్
Anitha: పోలీసులకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నాం

Anitha: గుంటూరు జిల్లాలో హోం మంత్రి అనిత పర్యటించారు. ఈ సందర్భంగా తుళ్లూరు పోలీస్ సబ్ డివిజన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు హోం మంత్రి. ఈ బిల్డింగ్ పూర్తి చేసేందుకు డీఎస్పీ మురళీ కృష్ణ, ఎస్పీ వకుల్ జిందల్ ఎంతో కృషి చేశారని హోం మంత్రి అనిత తెలిపారు. పోలీసులకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్‌ను తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.
2014లో సీఎం చంద్రబాబు అమరావతి ప్రారంభిస్తే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ కార్యాలయ పనులను పూర్తి చేయలేదన్నారు. అమరావతి రైతుల కష్టం ప్రతిఫలమే ఇవాళ అందరూ చూస్తున్నారన్నారు. రాజధాని కోసం రైతులు ఉచితంగా భూములు త్యాగం చేయడం గొప్ప విషయమన్నారు.



