తెలంగాణ

Vemulawada: రాజన్న ఆలయంలో ఇంటి దొంగ బాగోతం

Vemulawada: రాజ్‌న్యూస్ ఎఫెక్ట్‌తో వేములవాడ ఇంటి దొంగ వ్యవహారం బట్టబయలైంది. స్వామివారి ప్రసాదం కోసం తెచ్చిన సామాన్లు చోరీకి పాల్పడి అడ్డంగా బుక్కయ్యారు సూపరింటెండెంట్ వెంకట ప్రసాద్ రాజు. కమిటీ నివేదిక ఇచ్చి 15 రోజులైనా నివేదికను ఆలయ ఈవో రమాదేవి బయటపెట్టలేదు. సూపరిటెండెంట్ పై చర్యలు తీసుకోవడానికి రమాదేవి భయపడుతున్న వైనం. అయితే వేములవాడలో అక్రమాలపై ఆలయ ఈవో రమాదేవి రాజ్‌న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ అక్రమాలు ఏమీ లేవని బుకాయించారు.

వేములవాడ ఆలయంలో అధికారుల అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చిన రాజ్ న్యూస్‌కు సూపరిండెంట్ నోటీసులు పంపారు. అయితే ఆలయ అంతర్గత విచారణలో అక్రమాలు జరిగినట్లు రిపోర్టులు రాజ్‌న్యూస్ సంపాదించింది. నివేదికను తొక్కిపెట్టి మీడియాపైనే బెదిరింపు ప్రయత్నాలకు దిగుతున్నారు. అధికారులకు స్థానిక నేత అండదండలు ఉండడంతోనే అక్రమాలకు పాల్పడుతున్నారని చర్చ జరుగుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button