తెలంగాణ
సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

ఎడతెరిపి లేని వానలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచింది. ఇల్లందు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షం వల్ల కోయగూడెం ఓపెన్ కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలోని నాలుగు ఓపెన్కాస్ట్లు, శ్రీరాంపూర్ ఏరియా, మందమర్రి ఏరియా, బెల్లంపల్లి ఏరియాలోని ఓసీపీల్లోని క్వారీల్లో పనులు బంద్ పెట్టారు.
ఇప్పటి వరకు 7వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. క్వారీల్లో నీటిని మోటార్ల ద్వారా తోడుతున్నారు. డంపర్లు, డోజర్లు, షావల్ మెషీన్లను యార్డుపైనే నిలిపివేశారు.



