అంతర్జాతీయం
టిబెట్‌లో భారీ భూకంపం.. 16 మంది మృతి

టిబెట్‌లో భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక్కసారిగా సంభవించిన భూకంపంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 16 మంది మృతి చెందగా.. మరో 32 మంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదైంది. భూకంపం ధాటికి గాయపడిన వారిని అధికారులు వెంటనే ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.



