ఆంధ్ర ప్రదేశ్
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి తుపాను ముప్పు!

ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం క్రమంగా బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ అంచన వేస్తోంది. ఈనేపథ్యంలో నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండగా.. ఎల్లుండికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ నెల 27వ తేదీ నాటికి తుపానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
అనంతరం ఈ నెల 28న ఉత్తరాంధ్ర–ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ఈ ప్రభావంతో ఈ నెల 27వ తేదీ నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.. తుపాను దిశ, తీవ్రత, తీరం దాటే ప్రాంతంపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.



