తెలంగాణ

BRS: జూబ్లీహిల్స్ బైపోల్‌పై సీరియస్‌గా దృష్టి పెట్టిన బీఆర్ఎస్

BRS: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని తిరిగి సాధించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. గత సంవత్సరం పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరిగి‌న కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఓటమి చెందింది.

ఈనేపధ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది. బై ఎలక్షన్స్ లో గెలిచి తెలంగాణలో తాము బలంగానే ఉన్నామన్న సంకేతాలు ప్రజల్లోకి పంపాలని బీఆర్ఎస్ భావిస్తుంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ వ్యూహాలకు పదును పెడుతోంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చిన ఎదుర్కోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలను ఆదేశించారు.‌ ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గ్రౌండ్ వర్క్ ను ప్రారంభించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సమారు 1 లక్షా 20 వేల‌ ముస్లిం మైనారిటీ ఓట్లు ఉంగా వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది బీఆర్ఎస్. ఈనేపధ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ముస్లిం నేతలతో బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఇప్పటికే సమావేశం నిర్వహించారు.

స్మైల్ ఏ గిఫ్ట్ కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వారికి కేటీఆర్ కిట్లను పంపిణి చేసారు కేటీఆర్. ఇక మొన్న యూసఫ్ గూడా డివిజన్ కార్యకర్తలతో తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కాగా, తాజాగా రహమత్ నగర్ డివిజన్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. మాగంటి గోపీనాథ్ చేసిన సేవలకు నివాళిగా, మరొక్కసారి జూబ్లీహిల్స్‌లో గులాబీ జెండా ఎగరవేద్దామని పిలుపునిచ్చారు.

20 నెలల కాంగ్రెస్ అసమర్థ, అవినీతి ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ద్వార ప్రజలు బుద్ధి చెప్పాలని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇప్పుడు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారన్న కేటీఆర్ మోసగాళ్లకు, మోసగాళ్ల పార్టీ అయిన కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు గట్టి బుద్ధి చెప్పాలని అన్నారు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో మొత్తం ఆరు డివిజన్లు ఉండగా డివిజన్ల వారీగా ఇంచార్జ్ లను నియమించింది బీఆర్ఎస్.

జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం 6 డివిజన్లు ఉండగా డివిజన్ లు వారిగా ఇంచార్జిలను నియమించింది బిఆర్ఎస్

రెహమత్ నగర్ డివిజన్ ఇంచార్జ్ గా ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావు
యూసఫ్ గూడా డివిజన్ ఇంచార్జిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
బోరబండ డివిజన్ ఇంచార్జ్ గా ఎమ్మెల్యే వివేకానంద గౌడ్
షేక్ పేట్ డివిజన్ ఇంచార్జ్ గా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
వెంగల్ రావ్ నగర్ డివిజన్ ఇంచార్జ్ గా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎర్రగడ్డ డివిజన్ ఇంచార్జ్ గా మాధవరం కృష్ణారావు ను నియమించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button