ఆంధ్ర ప్రదేశ్
Nara Bhuvaneswari: నిమ్మకూరులో నారా భువనేశ్వరి పర్యటన

Nara Bhuvaneswari: కృష్ణా జిల్లా నిమ్మకూరులో నారా భువనేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా నిమ్మకూరు గ్రామం ఆర్చ్ వద్ద భువనేశ్వరికి మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, గ్రామస్థులు, తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమెకు నిమ్మకూరు గ్రామ మహిళలు హారతి ఇచ్చారు. వారిని భువనేశ్వరి ఆప్యాయంగా పలికరించారు.
ఈ సందర్భంగా భువనేశ్వరితో గ్రామస్తులు ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. గ్రామంలో ఉన్న ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు నారా భువనేశ్వరి నివాళులు ఆర్పించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.



