తెలంగాణ
హైదరాబాద్ కోఠి హెల్త్ కమీషనర్ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత

హైదరాబాద్ కోఠి హెల్త్ కమీషనర్ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. హెల్త్ కమీషన్ ఆఫీస్ ముట్టడికి ఆశా వర్కర్ల యత్నించారు. దీంతో పోలీసులు ఆశా వర్కర్లను అడ్డుకున్నారు. తమకు నెలకు 18వేల వేతనం ఇవ్వాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు.
50లక్షల ఇన్సూరెన్స్, మట్టి ఖర్చులు, ప్రమోషన్లు, ESI, PF, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని ఆశాలు కోరుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలంటున్నారు. ఇక హెల్త్ కమీషనర్ ఆఫీస్ ముట్టడికి వచ్చిన ఆశాలను పోలీసులు అడ్డుకొని పలువురిని అదుపులోకి తీసుకున్నారు.