తెలంగాణ
Fire Accident: మూసాపేటలో అగ్ని ప్రమాదం.. చెలరేగిన మంటలు

Fire Accident: హైదరాబాద్ పరిధిలోని మూసాపేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గూడ్స్ షెడ్ రోడ్డులోని ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపోలో ఉన్న గోడౌన్లో శనివారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోడౌన్లో నిల్వ ఉంచి వైన్ బాటిల్స్ అన్ని అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా అగ్నికీలలు ఎగసిపడటంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది.
దీంతో స్థానికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.



