Revanth Reddy: నేను ఇంకా 20ఏండ్లు రాజకీయాల్లో ఉంటా

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మరోసారి చిట్‌చాట్ నిర్వహించారు. అయితే ఈ చిట్‌చాట్‌లో పార్టీ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడారు ఆయన. కొందరు పదవులు రాలేదని నోరుజారుతున్నారని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్, అలాంటి వాళ్లకు అవకాశాలు ఉండవని క్లారిటీ ఇచ్చారు. కొందరు ఎమ్మెల్యేలకు పొగరు పెరిగిందంటూ హాట్ కామెంట్స్ చేశారు.
ఇక సీఎల్పీలో చెప్పినా ఎమ్మెల్యేల పనితీరు మారలేదంటూ మండిపడ్డారు. ఇక ఇప్పటికైనా ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో టైమ్‌పాస్ చేయడం సరికాదని.. పథకాలను ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ సూచించారు.
ఇక అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పాను ఇప్పించా అని వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్. పార్టీలో ఓపికగా ఉంటే పదవులు వస్తాయని తేల్చి చెప్పారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నష్టపోతారని సూచించారు. ఇంకా తాను 20ఏండ్లు రాజకీయాల్లో ఉంటానన్నారు రేవంత్. చట్టప్రకారమే నడుచుకుంటానని చెప్పారు.
అయితే తనకు అరెస్టులు చేయమని డిమాండ్లు వచ్చాయని అయినా ఎవర్ని అరెస్ట్ చేయలేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్. చేసిన పనులు చెప్పుకోవడంలో వెనకపడ్డామన్నారు రేవంత్. ఇక అధికార యంత్రాంగాన్ని స్టీమ్‌లైన్ చేశామన్న రేవంత్, ఆప్షన్ లేక కొంతమంది అధికారులను కొనసాగిస్తున్నట్లు చెప్పారు.